Pawan Kalyan: తన మిత్రుడు ఆనంద్ సాయితో కలిసి 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan attends Vakeel Saab Pre Release Event along with his friend Anand Sai
  • హైదరాబాదులో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • శిల్పకళావేదికలో కార్యక్రమం
  • పవన్ రాకతో అభిమానుల్లో జోష్
  • పవన్ కు స్వాగతం పలికిన వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు
హైదరాబాదు శిల్పకళావేదికలో జరుగుతున్న వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ వస్తారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను సంతోషసాగరంలో ముంచెత్తుతూ పవన్ కల్యాణ్ తన మిత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈవెంట్ కు వచ్చారు. పవన్ కు వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు స్వాగతం పలికారు. పవన్ రాకతో కాసేపు శిల్పకళావేదిక మార్మోగిపోయింది.
Pawan Kalyan
Vakeel Saab
Pre Release Event
Anand Sai
Hyderabad

More Telugu News