TTD: ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్న టీటీడీ.. మ‌ళ్లీ చేర‌నున్న ర‌మ‌ణ దీక్షితులు

ttd takes decision on retired priests
  • వయో పరిమితి ముగియ‌డంతో గ‌తంలో ప‌ద‌వీ విర‌మ‌ణ
  • హైకోర్టు ఆదేశాల మేర‌కు తిరిగి విధుల్లోకి
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన టీటీడీ
వయో పరిమితి ముగియ‌డంతో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన‌ తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివ‌రించింది.

గతంలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌ ప్రధాన అర్చకులతో పాటు ఇత‌ర‌ అర్చకులు విధుల్లో చేరాలని టీటీడీ తెలిపింది. దీంతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు కూడా తిరిగి విధుల్లో చేర‌తారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు ఆయా హోదాల్లో కొనసాగే అంశంపై సందిగ్ధత నెలకొంది.
TTD
Tirupati
Tirumala

More Telugu News