పోటీకి ముందే అస్త్ర సన్యాసం చేస్తారా?: టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి వ్యంగ్యం
- పరిషత్ ఎన్నికల బహిష్కరణ దిశగా టీడీపీ!
- 40 శాతం పంచాయతీలు గెలిచినట్టు డప్పుకొట్టారన్న విజయసాయి
- ఇప్పుడు తర్జనభర్జనలేంటని వ్యంగ్యం
- మున్సిపల్ ఎన్నికల్లో మీ రంగు బయపడిందనా? అంటూ ఎద్దేవా
కాగా, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్పరెన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నందున ఆయన వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా? లేక బహిష్కరిస్తుందా? అనే అంశంపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.