తూర్పు తైవాన్‌లో రైలు ప్రమాదం.. 36 మంది మృతి.. వీడియో ఇదిగో
- ఈ రోజు ఉదయం ప్రమాదం
- 72 మందికి గాయాలు
- పట్టాలు తప్పిన రైలు
- సొరంగంలో ఇరుక్కుపోయిన వైనం
హువాలియన్‌కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగం వద్ద ఓ ట్రక్ ఒక్కసారిగా రైలు పట్టాల పైకి జారిపోయిందని, అదే సమయంలో ఆ రైలు పట్టాల మీదుగా తైటంగ్‌కు ప్రయాణిస్తున్న ఓ రైలు రావడంతో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రమాదానికి గురైన రైలు సొరంగం మధ్య ఇరుక్కు పోయిందని, దీంతో రక్షణ చర్యలు చేపట్టడానికి సహాయక బృందాలు శ్రమించాల్సి వస్తోందని చెప్పాయి.