చిరంజీవి చేతి వంట రుచి చూసిన నాగార్జున!
- శుక్రవారం వైల్డ్ డాగ్ చిత్రం రిలీజ్
- ప్రమోషన్ ఈవెంట్లతో నాగ్ బిజీ
- చిరంజీవి నివాసానికి వెళ్లిన వైనం
- కమ్మని విందు ఏర్పాటు చేసిన మెగాస్టార్
- కృతజ్ఞతలు తెలిపిన నాగ్
చిరంజీవి తన కోసం స్వయంగా వంట చేశారని నాగ్ వెల్లడించారు. రేపు వైల్డ్ డాగ్ రిలీజ్ కానుండడంతో కొంచెం ఒత్తిడిలో ఉన్నానని, అయితే ఆ ఒత్తిడిని తొలగించేందుకు మెగాస్టార్ స్వయంగా గరిటె పట్టుకుని వంట చేశారని, రుచికరమైన విందు భోజనం వడ్డించారని నాగ్ వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా నాగ్ పంచుకున్నారు. ఆ ఫొటోను చిరంజీవి అర్ధాంగి సురేఖ తీశారని తెలిపారు.