YSRCP: రాజమండ్రిలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు

YCP cadre joins TDP in Rajahmundry
  • రాజమండ్రిలో ఆసక్తికర ఘట్టం
  • పార్టీ మారిన వైసీపీ శ్రేణులు
  • టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • వైసీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీలోకి ఆహ్వానించిన భవానీ
ఇటీవల కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరడం చాలా అరుదు. అయితే, రాజమండ్రిలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. రాజమండ్రి అర్బన్ టీడీపీ నేత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ల సమక్షంలో 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారంతా రాజమండ్రి నగరంలోని 14, 15వ వార్డులకు చెందినవారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
YSRCP
TDP
Rajahmundry
Adireddy Bhavani
Telugudesam
Andhra Pradesh

More Telugu News