Telangana: భ‌వనంపై నుంచి దూకి కెనడాలో తెలంగాణ‌ విద్యార్థి సూసైడ్

telangana student commits suicide
  • నల్లగొండ జిల్లాలోని డిండి మండలానికి చెందిన ప్ర‌వీణ్
  • ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం కెనడాకు విద్యార్థి
  • ఆత్మ‌హ‌త్య‌పై పోలీసుల ఆరా
కెనడాలో ఓ తెలంగాణ‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లాలోని డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్‌ రావు అనే విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం కెనడా వెళ్లాడు.  అయితే,  ఏం క‌ష్టం వ‌చ్చిందో.. ఈ రోజు ఉద‌యం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అతని ఆత్మహత్యకు గ‌ల‌ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ తల్లిదండ్రుల పేర్లు నారాయణరావు, హైమావతి. వారిది సాధారణ రైతు కుటుంబం. ఉన్నత ఆశయాలతో త‌మ కుమారుడు కెన‌డాకు వెళ్లి చ‌దువుకుంటున్నాడ‌ని వారు చెప్పారు. క‌ల‌ను నెర‌వేర్చుకోవాల‌నుకున్న కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ వారు విల‌పించారు. ప్ర‌వీణ్ కుమార్ మృతిపై వారు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు .
Telangana
Canada

More Telugu News