Suvendu Adhikari: నాపై పోటీ చేస్తున్న మమతకు ఓటమి ఖాయం: సువేందు అధికారి

I will defeat Mamata Banerjee says Suvendu Adhikari
  • ఈ ప్రాంత ప్రజలతో నాది దశాబ్దాల అనుబంధం
  • ప్రతి వ్యక్తితో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది
  • నందిగ్రామ్ లో నా గెలుపు ఖాయం
పశ్చిమబెంగార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఈరోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీపడుతున్న నందిగ్రామ్ నియోజకవర్గానికి కూడా ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక నందనాయక్ పబ్లిక్ స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో సువేందు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చి ఆయన ఓటు వేశారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనపై పోటీ చేస్తున్న దీదీకి ఓటమి తప్పదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలతో తనది దశాబ్దాల అనుబంధమని... ప్రతి వ్యక్తితో తనకు వ్యక్తిగత పరిచయం ఉందని చెప్పారు. తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటు వేసేందుకు గ్రామీణ ప్రజలు కదిలొస్తున్నారని చెప్పారు. అన్ని బూత్ లలో ఏజెంట్లను నియమించుకోవడంలో కూడా టీఎంసీ విఫలమయిందని... దీదీ ఓటమి తప్పదని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Suvendu Adhikari
BJP
Mamata Banerjee
TMC

More Telugu News