Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో పేలిన నాటు బాంబులు

country made bombs blast at tirupati sv university campus
  • యూనివర్సిటీ ఐ బ్లాక్ సమీపంలో పేలుడు
  • శునకం, వరాహం మృత్యువాత
  • ఇద్దరు వేటగాళ్ల అరెస్ట్
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ఆవరణలో ఈ ఉదయం రెండు నాటు బాంబులు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. ఈ ఘటనలో ఓ శునకం, వరాహం మృతి చెందాయి. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఈ  పేలుడు సంభవించింది.  సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న క్యాంపస్ పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా బాంబులు ఉన్నాయేమోనని క్షుణ్ణంగా గాలించారు. అడవి పందులను వేటాడేందుకే బాంబులను అక్కడ పెట్టినట్టు గుర్తించిన పోలీసులు ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tirupati
SV University
Country Made Bombs

More Telugu News