AP BJP: క్యాబేజీలతో పాటు బిస్కెట్లు కూడా పంపిస్తాం.. విజయసాయికి బీజేపీ కౌంటర్

AP BJP gives counter to Vijayasai Reddy
  • కాబోయే సీఎం పవన్ అన్న సోము వీర్రాజు
  • జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట అన్న విజయసాయి
  • మీ అహంకారపు మాటల్ని నేలకూల్చే రోజు దగ్గర్లోనే ఉందన్న బీజేపీ
తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి, బీజేపీ నేతలకు మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. 'జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక. కాబోయే సీఎం  ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట!' అంటూ విజయసాయి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాబోయే సీఎం పవన్ అని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు.

విజయసాయి స్పందనపై ఏపీ బీజేపీ ఘాటుగా స్పందించింది. 'మా పార్టీపై మీరు చేసే వ్యాఖ్యలు, మేము మీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నామని తెలియ చేస్తున్నాయి. మీ అహంకారపు మాటల్ని నేలకూల్చే రోజు దగ్గర్లోనే ఉంది. ఆరోజు లోపలికి క్యాబేజీలతో పాటు బిస్కెట్లు కూడా పంపిస్తాం. తప్పుడు మాటలు మాని అప్పులెట్టా తేవాలో చూడండి సాయి అన్నా!' అని ఏపీ బీజేపీ ట్వీట్ చేసింది.
AP BJP
Vijayasai Reddy
YSRCP

More Telugu News