Lahe Lahe: "లాహే లాహే"... ఆచార్య నుంచి తొలి పాట విడుదల

First single released from Acharya
  • చిరంజీవి హీరోగా 'ఆచార్య' చిత్రం
  • కొరటాల శివ దర్శకత్వంలో సినిమా
  • ట్రెండీగా ఉన్న చిరు కొత్త సాంగ్
  • మణిశర్మ బాణీలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం
  • మే 14న విడుదల కానున్న 'ఆచార్య'
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. "లాహే లాహే"... అంటూ మొదలయ్యే ఈ గీతానికి మణిశర్మ స్వరాలు కూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఆలపించారు. 'లాహే లాహే' గీతం  ట్యూన్, సాహిత్యం ఇప్పుడొస్తున్న జానపద గీతాల ట్రెండ్ కు కాస్తంత దగ్గరగానే  ఉన్నాయి.

'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపిస్తారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న 'ఆచార్య' చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lahe Lahe
Acharya
Single
Chiranjeevi
Koratala Siva

More Telugu News