Devegowda: మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన భార్యకు కరోనా పాజిటివ్

Devegowda and his wife Chennamma have tested positive for corona
  • తమకు కరోనా సోకినట్టు స్వయంగా వెల్లడించిన దేవెగౌడ
  • స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు వెల్లడి
  • ఎవరూ ఆందోళన చెందవద్దని విన్నపం
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మకు కరోనా సోకింది. ఈ విషయాన్ని దేవెగౌడ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.

'నాకు, నా భార్య చెన్నమ్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం మా కుటుంబసభ్యులతో కలిసి స్వీయ నిర్బంధంలో ఉన్నాము. గత కొన్ని రోజులుగా మాకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. పార్టీ వర్కర్లు, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దు' అని దేవెగౌడ ట్వీట్ చేశారు.
Devegowda
Wife
Corona Virus

More Telugu News