Uddhav Thackeray: ఆసుపత్రిలో చేరిన ఉద్ధవ్ థాకరే భార్య

Uddhav Thackerays wife Rashmi Thackeray admits hospital
  • ఈ నెల 23న రష్మి థాకరేకు కరోనా పాజిటివ్
  • ఈ నెల 11 వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్న రష్మి
  • నీరసంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరిక
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరే ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 23న ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా చాలా నీరసంగా అనిపిస్తుండటంతో చెకప్ కోసం ఆమె హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 11న ఆమె కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. మార్చి 20న ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరేకు కరోనా పాజిటివ్ గా తేలింది. శివసేన అధికార పత్రిక సామ్నాకు రష్మి థాకరే ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Uddhav Thackeray
Wife
Rashmi Thackeray

More Telugu News