KhushbuSundar: ప్రచారంలో సొంత పార్టీ నేతపైనే విరుచుకుపడిన ఖుష్బూ.. పక్కనే ఉండి ఇబ్బంది పడిన కేకే సెల్వం

Khushbu Sundar fire on own party leader in election campaign
  • ఇటీవల బీజేపీలో చేరిన డీఎంకే ఎమ్మెల్యే కేకే సెల్వం
  • ప్రచారంలో ఖుష్బూ వెంట నేత
  • ఖుష్బూ వ్యాఖ్యలతో జనం నవ్వులు
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీనటి ఖుష్బూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఖుష్బూ సొంత పార్టీ నేతపైనే నిప్పులు చెరిగారు. దీంతో పక్కనే ఉన్న ఆయన ఇబ్బంది పడ్డారు.

ప్రచారంలో ఖుష్బూ మాట్లాడుతూ..  గత ఎమ్మెల్యే ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలకు జనం నవ్వుతూ కేకలు వేశారు.

ఖుష్బూ వ్యాఖ్యలతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే కేకే సెల్వం ఇబ్బంది పడగా, గమనించిన ఓ నేత ‘‘మీరు మండిపడుతున్నది ఈయన మీదే’ అనడంతో ఖుష్బూ నాలుక్కరుచుకున్నారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటివరకు ఈ నియోజక వర్గ ఎమ్మెల్యేగా వున్న కేకే సెల్వం ఇటీవల డీఎంకే నుంచి బీజేపీలో చేరారు. ఆ విషయం తెలియని ఆమె యథాలాపంగా విమర్శలు కురిపించారు.
KhushbuSundar
Tamil Nadu
BJP
DMK

More Telugu News