TTD: కరోనా ఎఫెక్ట్.. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తగ్గించిన టీటీడీ!

TTD reduces sarva darshanam tokens amid raise in Corona cases
  • వెంకన్న దర్శనాలపై కూడా కరోనా ఎఫెక్ట్
  • రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ 15 వేలకు పరిమితం
  • ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి నో ప్రాబ్లం
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం ప్రముఖ ఆలయాలపై కూడా పడుతోంది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలపై కూడా కరోనా ఎఫెక్ట్ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు.

రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని 15 వేలకు పరిమితం చేస్తున్నామని ధర్మారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో ఇప్పటికే విడుదల చేశామని... టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే అంశంపై... అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమలకు రావాలని... అనవసరంగా ఇబ్బంది పడవద్దని సూచించారు. మిజోరాంలో పట్టుబడిన తలనీలాలకు టీటీడీతో సంబంధం లేదని స్ఫష్టం చేశారు.
TTD
Tirumala
Sarva Darshanam Tokens
Corona Virus

More Telugu News