అప్పులు చేసి ప్రజలను ఆదుకున్న నాయకుడు జగన్: కొడాలి నాని
- రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే
- లోకేశ్ ని ఓడించారని ప్రజలను తిడుతున్నారు
- తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోంది
కరోనా వల్ల ప్రజలకు తినడానికి తిండి లేకపోతే... అప్పులు చేసి ప్రజలను ఆదుకున్న నాయకుడు జగన్ అని కొడాలి నాని ప్రశంసించారు. అప్పులను ఇప్పుడు కాకపోతే పదేళ్ల తర్వాత తీర్చుకోవచ్చని... ప్రజల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం బడ్జెట్ పెట్టలేకపోయిందనే సొల్లు చెపితే వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. వెంకన్న దయతో వైసీపీ 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.