Narendra Modi: నేడు పుదుచ్చేరిలో మోదీ ఎన్నికల ర్యాలీ.. డ్రోన్లు, యూఏవీలపై నిషేధం

PM Modis Puducherry visit Drones and UAVs banned to tighten security
  • ఏప్రిల్ 6న పుదుచ్చేరిలో ఎన్నికలు
  • ఎన్‌డీఏ అభ్యర్థుల తరపున మోదీ ప్రచారం
  • ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పుదుచ్చేరిలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు, అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీలు)ను నిషేధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్ తెలిపారు.

పుదుచ్చేరి మొత్తానికి ఈ ఆంక్షలు వర్తిస్తాయని, డ్రోన్స్, యూఏవీలను ఎగరవేయడాన్ని నిషేధించామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే 188 సెక్షన్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల 6న పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్‌డీఏ అభ్యర్థుల తరపున మోదీ నేడు ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు.
Narendra Modi
Puducherry
Assembly Elections

More Telugu News