Trailer: "బాబాయ్... మైండ్ బ్లోయింగ్": 'వకీల్ సాబ్' ట్రైలర్ పై రామ్ చరణ్ వ్యాఖ్యలు

Ramcharan response on Pawan Kalyan Vakeel Saab trailer
  • 'వకీల్ సాబ్' చిత్రం నుంచి ట్రైలర్ విడుదల
  • పవన్ మేనియాతో ఊగిపోతున్న ఫ్యాన్స్
  • కొద్దిసమయంలోనే ట్రైలర్ కు విశేషమైన రెస్పాన్స్
  • ఎప్పట్లాగానే పవర్ ఫుల్ గా ఉందంటూ చరణ్ ట్వీట్
పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రకంపనలు పుట్టిస్తోంది. 2018లో ఆయన 'అజ్ఞాతవాసి' చిత్రంలో నటించగా, మళ్లీ ఇన్నాళ్లకు 'వకీల్ సాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దాంతో ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా విడుదలైంది ట్రైలరే అయినా వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.

ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' ట్రైలర్ పై హీరో రామ్ చరణ్ స్పందించాడు. "బాబాయ్... మైండ్ బ్లోయింగ్" అంటూ ట్రైలర్ పై వ్యాఖ్యానించాడు. "ఎప్పట్లాగానే పవర్ ఫుల్ గా ఉంది" అంటూ ట్వీట్ చేశాడు.

కాగా ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 3.8 మిలియన్లకు పైగా వ్యూస్, 6.82 లక్షలకు పైగా లైక్స్ అందుకోవడం విశేషం. పవన్, శ్రుతిహాసన్ జంటగా వస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ కే ఇలావుంటే సినిమా రిలీజైతే అభిమానుల స్పందన ఇంకెంత భారీగా ఉంటుందో చూడాలి. బాలీవుడ్ లో హిట్టయిన 'పింక్' చిత్రాన్ని పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Trailer
Vakeel Saab
Pawan Kalyan
Ramcharan
Tollywood

More Telugu News