Karnataka: కంబళ వీరుడు, అభినవ ఉసేన్ బోల్ట్‌ శ్రీనివాస గౌడ సరికొత్త రికార్డు

Srinivas Gowda Sets New Record In 100mtrs Kambala Racing
  • 100 మీటర్లు  8.78 సెకన్లలోనే పూర్తి
  • గత ఏడాది 9.55 సెకన్ల రికార్డును తిరగరాసిన గౌడ
  • 125 మీటర్ల పరుగు 11.21 సెకన్లలో పూర్తి
  • వారం క్రితం 8.96 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తి
కర్ణాటకకు చెందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ అభినవ ఉసేన్‌ బోల్ట్‌గా పేరుగాంచారు. ఈసారి కంబళ పోటీల్లో మరో రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది 9.55 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తి చేసి వార్తల్లోకి ఎక్కిన శ్రీనివాస ఇప్పుడు 8. 78 సెకన్లలోనే పూర్తి చేసి ఆ రికార్డును తిరగ రాశాడు.

ఆదివారం జరిగిన పోటీల్లో  125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలోనే శ్రీనివాస పూర్తి చేశాడు. దీన్ని 100 మీటర్లకు లెక్కగట్టగా  8.78 సెకన్లలోనే పరుగు పూర్తిచేసినట్లని అధికారులు తెలిపారు. గతవారం నిర్వహించిన ఓ పోటీలో 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస 8.96 సెకన్లలో పూర్తి చేశాడు. వారం తిరగకముందే తాజాగా జరిగిన పోటీల్లో తన రికార్డును తానే తిరగరాశాడు.

కంబళ అన్నది ఏటా కన్నడ నాట.. బురదలో దున్నపోతులతో పరుగులు పెట్టించే ఓ వ్యవసాయ క్రీడ.
Karnataka
Kambala
Usain Bolt
100 Mtrs race
Srnivasa Gowda

More Telugu News