Jammu And Kashmir: కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రమూకలు

Terrorists in JK Killed a councillor and police officer
  • సోపోర్‌లో మున్సిపల్ కార్యాలయంపై దాడి
  • ఓ పోలీస్‌ సహా కౌన్సిలర్‌ మృతి
  • మరో కౌన్సిలర్‌కు తీవ్ర గాయాలు
  • ముష్కరుల కోసం కొనసాగుతున్న గాలింపు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లో మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. సమావేశంలో ఉన్న  కౌన్సిలర్, పోలీస్ అధికారిని కాల్చి చంపారు. ముష్కరుల కాల్పుల్లో మరో కౌన్సిలర్ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు ముష్కరుల కోసం గాలిస్తున్నారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన పోలీస్ అధికారి షఫ్కత్ అహ్మద్, కౌన్సిలర్ రియాజ్ అహ్మద్ మృతి పట్ల కశ్మీర్‌ ఐజీ విజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మరో కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్‌కు మెరుగైన చికిత్స అందుతోందని తెలిపారు.
Jammu And Kashmir
Terrorists
Police

More Telugu News