Jagan: ఏప్రిల్ 1న గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్

AP CM Jagan will be taken corona vaccine on April first
  • దేశంలో కరోనా వ్యాప్తి
  • 45 ఏళ్లకు పైబడినవారందరికీ ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్
  • గుంటూరు భరత్ పేట వార్డు సచివాలయానికి రానున్న సీఎం జగన్
  • కరోనా తొలి డోసు వేయించుకోనున్న వైనం
దేశంలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు, అంతకు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ ఏప్రిల్ 1న గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోనున్నారు. ఆయన ఉదయం 11.10 గంటలకు గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయానికి రానున్నారు. వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో టీకా తీసుకుంటారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయ ఉద్యోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు తాడేపల్లి నివాసానికి తిరిగి వెళతారు.
Jagan
April 1st
Crorona Vaccine
Guntur
Ward Secretariat
Andhra Pradesh

More Telugu News