Chinta Mohan: తిరుపతిలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉంది: చింతా మోహన్

Congress win is needed in Tirupati says Chinta Mohan
  • మోదీని ప్రశ్నించే ధైర్యం జగన్ కు లేదు
  • పిచ్చికి మోదీ పాలన నిదర్శనం
  • దేశ చరిత్రలో తిరుపతి ఉపఎన్నిక ఒక చారిత్రాత్మక ఎన్నిక
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ లపై విమర్శలు గుప్పించారు. భారతదేశ చరిత్రలో తిరుపతి ఉపఎన్నిక ఒక చారిత్రాత్మక ఎన్నిక అని అన్నారు.

పిచ్చి పాలనకు నరేంద్ర మోదీ పరిపాలన, మంచి పాలనకు కాంగ్రెస్ పరిపాలన ఉదాహరణ అని చెప్పారు. ప్రధాని మోదీని ప్రశ్నించే ధైర్యం జగన్ కు లేదని అన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. అన్ని పార్టీలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Chinta Mohan
Congress
Jagan
YSRCP
Narendra Modi
BJP

More Telugu News