Visakhapatnam: విశాఖ వైసీపీ మహిళా కార్పొరేటర్‌పై దాడి.. కారుపై సీసాలు విసిరిన దుండగులు

YSRCP Visakha Corporator attacked
  • 77వ డివిజన్ నుంచి గెలిచిన సూర్యకుమారి
  • అప్పికొండలో అభినందన సభ
  • తిరిగి వెళ్తుండగా ఘటన
విశాఖపట్టణం 77వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి‌పై దుండగులు దాడిచేశారు. ఈ దాడి నుంచి ఆమె క్షేమంగా బయటపడ్డారు. అప్పికొండలో నిన్న సూర్యకుమారికి అభినందన సభ ఏర్పాటు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి ఈ సభకు హాజరయ్యారు. సభ అనంతరం సూర్యకుమారి కారులో ఇంటికి బయలుదేరారు.

ఈ క్రమంలో ఆమె కారు పాలవలస సమీపంలోని గొలెందిబ్బ జీడి తోటల వద్దకు చేరుకున్న సమయంలో ఇద్దరు యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి కారును అడ్డగించారు. మద్యం సీసాలతో కారుపై దాడిచేశారు. వెనకే వస్తున్న వైసీపీ కార్యకర్తలు గమనించి దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్తపై దుండగులు దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యారు. దాడిచేసిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Visakhapatnam
Corporator
YSRCP

More Telugu News