Ramesh Jarkiholi: కర్ణాటక రాసలీలల సీడీ కేసు.. నేడు కోర్టు ముందుకు బాధిత యువతి?

Young woman who is in sex CD may attend to court today
  • ఈ నెల 2న తొలి వీడియో విడుదల
  • కోర్టు వద్దే అదుపులోకి తీసుకోవాలని పోలీసుల యోచన
  • యువతి తల్లిదండ్రులకు కట్టుదిట్టమైన భద్రత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక సెక్స్ సీడీ కేసులో బాధిత యువతి నేడు అజ్ఞాతం వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళితో బాధిత యువతి ఏకాంతంగా ఉన్న వీడియో ఒకటి ఈ నెల 2న వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ సీడీలో కనిపించిన యువతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె కోసం పోలీసులు వెతికినప్పటికీ ఆచూకీ గుర్తించలేకపోయారు. అజ్ఞాతంలో నుంచే ఆమె ఇప్పటి వరకు 5 వీడియోలు విడుదల చేశారు.

కాగా, ఆమె నేడు కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న ఉదయం తన న్యాయవాది జగదీశ్, సహోద్యోగి మంజునాథ్‌తో సోషల్ మీడియా ద్వారా జరిపిన సంప్రదింపులు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఆమె నేడు కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని న్యాయవాది జగదీశ్ కూడా చెప్పారు. అదే జరిగితే కోర్టు బయట ఆమెను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, యువతి తల్లిదండ్రులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
Ramesh Jarkiholi
Sex CD
Court
Karnataka

More Telugu News