Surabhi Vanidevi: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్

TRS MLC Surabhi Vanidevi tetsed corona positive
  • ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గిన వాణీదేవి
  • అంతలోనే కరోనా బారినపడిన వైనం
  • తనను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోవాలన్న వాణీదేవి
  • ఐసోలేషన్ లో ఉండాలని సూచన
కరోనా వైరస్ మహమ్మారికి వారు వీరు అనే తేడా లేదు! సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు అందరికీ సోకుతోంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కూడా కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్షలు చేయించుకున్న ఆమెకు పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని సురభి వాణీదేవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని, ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. వాణీదేవి ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.
Surabhi Vanidevi
Corona Virus
Positive
MLC
TRS
Telangana

More Telugu News