India: ప్రపంచకప్ షూటింగ్ లో ఎవరికీ అందనంత ఎత్తులో భారత్

India tops medal chart in Wolrd Cup Shooting championship
  • ఢిల్లీ వేదికగా వరల్డ్ కప్ షూటింగ్ పోటీలు
  • భారత్ ఇప్పటివరకు 30 పతకాలు
  • 15 పసిడి పతకాలు చేజిక్కించుకున్న భారత షూటర్లు
  • అమెరికా ఖాతాలో 4 స్వర్ణాలు
  • భారత్ తర్వాత రెండో స్థానంలో అమెరికా
మునుపెన్నడూ లేని విధంగా భారత షూటర్లు అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ లో అత్యధిక పతకాలతో మనవాళ్లు ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఇవాళ జరిగిన ట్రాప్ ఈవెంట్స్ లో పురుషుల, మహిళల విభాగాల్లో పసిడి పతకాలు భారత షూటర్ల వశమయ్యాయి. ఇప్పటివరకు భారత షూటర్లు ఈ మెగా టోర్నీలో 15 స్వర్ణ పతకాలు నెగ్గారు. అంతేకాదు, 9 రజతాలు, 6 కాంస్య పతకాలతో మొత్తం 30 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. తద్వారా పతకాల పట్టికలో భారత్ టాప్ లో నిలిచింది.

ఇక అమెరికా ఈ టోర్నీలో భారత్ తర్వాత రెండోస్థానంలో కొనసాగుతోంది. అమెరికా ఖాతాలో 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్య ఉంది. ఏదేమైనా సొంతగడ్డపై జరుగుతున్న పోటీల్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఈ పోటీలకు రేపు ఆఖరి రోజు కాగా, భారత్ ఖాతాలో మరికొన్ని పతకాలు చేరే అవకాశం ఉంది.
India
World Cup Shooting
Medals
New Delhi

More Telugu News