Amazon: ఎలక్ట్రానిక్స్‌ డే పేరిట అమెజాన్‌ కొత్త సేల్‌ సీజన్

amazon india announces electronics day special offers
  • మార్చి 29న ప్రారంభం
  • ఆఫర్‌పై ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు
  • బీఓఐ, ఇండస్‌ఇండ్‌ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌
  • నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్‌ వంటి ఆఫర్లూ ఉన్నాయి
‘ఎలక్ట్రానిక్స్‌ డే’ పేరిట అమెజాన్‌ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్లకు చెందిన ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, కెమెరాలు, ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, మానిటర్లు వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలపై ఆఫర్లు అందించనుంది. బోట్‌, ఇంటెల్‌, హెచ్‌పీ, సోనీ, శాంసంగ్‌, ఎంఐ సహా మరిన్ని ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. మార్చి 29, 2021 నుంచి ఈ ప్రత్యేక సేల్ సీజన్‌ అందుబాటులోకి రానుంది.

బ్యాంక్ ఆఫ్‌ బరోడా, ఇండస్‌ఇండ్‌ క్రెడిట్‌ కార్డులు వినియోగించి కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ రానుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్‌ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. మరికొన్ని వస్తువులపై ధరను తగ్గించారు.

కొన్ని ఆఫర్లు ఇలా ఉన్నాయి...

* లెనొవో లెజియన్‌ 5 గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ రూ.80,990లకే లభించనుంది.

* బోట్‌ ఎయిర్‌డోప్స్‌ 441 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ రూ.1,999కి అందుబాటులో ఉంది.

* ప్యానసోనిక్‌ ల్యూమిక్స్‌ జీ7 మిర్రర్‌లెస్‌ కెమెరా రూ.38,490కి రానుంది.

* ఎంఐ వాచ్‌ రివాల్వ్‌ రూ.8,999కి లభించనుంది.

* లెనొవొ ట్యాబ్‌ ఎం10 ఎఫ్‌హెచ్‌డీ(వైఫై+ఎల్‌టీఈ) ట్యాబ్లెట్‌ రూ.12,499కి అందుబాటులో ఉంది.
Amazon
Electronics day
laptops
HeadPhones
Sony

More Telugu News