Kurnool: రేపటి నుంచి కర్నూలు ఎయిర్ పోర్ట్ లో విమానాల రాకపోకలు.. ఆయా విమానాల వివరాలు!

Air services of Kurnool airport starts from tomorrow
  • విశాఖ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు
  • విశాఖ, బెంగళూరులకు ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో సర్వీసులు
  • చెన్నైకి మంగళ, గురు, శని, ఆదివారాల్లో సర్వీసులు
కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్టు నుంచి రేపటి నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు రాకపోకలు ప్రారంభమవుతాయి. కర్నూలు-విశాఖ, కర్నూలు-బెంగళూరు మధ్య ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో రాకపోకలు ఉంటాయి. కర్నూలు నుంచి ఉదయం 10.30 గంటలకు బయల్దేరే విమానం మధ్యాహ్నం 12.40కి అక్కడకు చేరుకుంటుంది. అనంతరం అదేరోజు మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయల్దేరి 2.55కి కర్నూలుకు చేరుకుంటుంది.

బెంగళూరు నుంచి ఉదయం 9.05కి బయల్దేరి 10.10కి కర్నూలు చేరుకుంటుంది. అదేరోజు తిరిగి 3.15 గంటలకు కర్నూలులో బయల్దేరి 4.25 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఇక చెన్నై విమాన సర్వీసుల విషయానికి వస్తే... కర్నూలు-చెన్నై మధ్య మంగళ, గురు, శని, ఆదివారాల్లో సర్వీసులు ఉంటాయి. చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50కి బయల్దేరి 4.10కి కర్నూలుకు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకి 5.50కి చేరుకుంటుంది.
Kurnool
Airport
Services

More Telugu News