Vakeel Saab: డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'

Dubbing work wrapped up for Vakeel Saab
  • పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో 'వకీల్ సాబ్'
  • బాలీవుడ్ 'పింక్' కు తెలుగులో రీమేక్
  • వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చిత్రం
  • పవన్ సరసన శ్రుతిహాసన్
  • కీలకపాత్రల్లో నివేదా, అంజలి, అనన్య
  • ఏప్రిల్ 9న రిలీజ్
పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రం డబ్బింగ్ పనులు నేటితో పూర్తయ్యాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' కు రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న 'వకీల్ సాబ్' చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది.

'పింక్' లో లెజెండరీ అమితాబ్ బచ్చన్ పోషించిన న్యాయవాది పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోషించారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలకపాత్రధారులు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి.
Vakeel Saab
Dubbing
Pawan Kalyan
Venu Sriram
Shruti Haasan
Tollywood

More Telugu News