Narendra Modi: బంగ్లాదేశ్‌లో కాళీ మాత‌ ఆల‌యంలో ప్ర‌ధాని మోదీ పూజ‌లు.. వీడియో ఇదిగో

Modi offers prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur
  • రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ లో మోదీ
  • ఈశ్వరీపూర్ లోని  జెశోరేశ్వ‌రి కాళీ ఆల‌యం సంద‌ర్శ‌న‌
  • మాన‌వాళిని క‌రోనా నుంచి కాపాడాలని మొక్కుకున్న మోదీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ వెళ్లిన భార‌త‌ ప్రధాని నరేంద్ర మోదీ అక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఉద‌యం ఆయ‌న సత్కిరా జిల్లా ఈశ్వరీపూర్ లోని  జెశోరేశ్వ‌రి కాళీ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్నారు. దుర్గామాత శ‌క్తి పీఠాల్లో జెశోరేశ్వ‌రి ఆల‌యం ఒక‌‌టి.

కాళీ మాత‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం మోదీ మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు ఇక్క‌డి కాళీ మాత‌కు పూజ చేసే అవ‌కాశం ల‌భించిందని చెప్పారు. మాన‌వాళిని క‌రోనా నుంచి కాపాడాలని తాను జ‌గ‌న్మాత‌ను కోరుకున్నాన‌ని మోదీ చెప్పారు. కాగా, బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో అతిథిగా పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్క‌డకు వెళ్లారు. అలాగే, ఆయ‌న ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటున్నారు.
Narendra Modi
BJP
Bangladesh

More Telugu News