Shakeela: తమిళనాట కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి షకీలా

Actress Shakeela joins Congress party in Tamilnadu
  • కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించిన షకీలా
  • పార్టీ మానవ హక్కుల విభాగంలో పనిచేయనున్న నటి
  • ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న షకీలా
  • కాంగ్రెస్ ద్వారా తన లక్ష్యం నెరవేరుతుందని ఆశాభావం  
శృంగార తారగా పేరుపొందిన నటి షకీలా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల విభాగంలో షకీలా సేవలు అందించనున్నారు. పార్టీలో చేరిన సందర్భంగా షకీలా మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేసేందుకు అధికారం ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యమని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ద్వారా తన అభిమతం నెరవేరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కొంతకాలంగా షకీలా రాజకీయ ప్రవేశంపై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించిన ఆమె, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొననున్నారు.
Shakeela
Congress
Tamilnadu
Human Rights Wing
Actress

More Telugu News