ఈజిప్టులో రైలు ప్రమాదం.. 32 మంది మృతి

Thirty two Killed 66 Injured In Egypt Train Collision incident
  • మరో 66 మందికి తీవ్ర గాయాలు
  • దక్షిణ కైరో సమీపంలోని షోహాగ్‌లో దుర్ఘటన
  • పాసింజర్‌ రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోవడంతో ప్రమాదం
ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దక్షిణ కైరోకి సమీపంలో రెండు పాసింజర్‌ రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో 32 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 66 మందికి గాయాలైనట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు బోగీలు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘటనా స్థలానికి 36 అంబులెన్స్‌లు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఖలీద్‌ మెజాహెద్‌ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Egypt
Trains Collide
Cairo

More Telugu News