India: బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరిన నరేంద్ర మోదీ!

After Corona Modis First Foreign Tour to Bangladesh Started
  • రెండు రోజుల పాటు బంగ్లాలో పర్యటన
  • కరోనా తరువాత తొలి విదేశీ పర్యటనలో ప్రధాని
  • బంగ్లా అభివృద్ధికి సహకరిస్తానని హామీ
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఢాకాకు బయలుదేరి వెళ్లారు. ఆయన పర్యటన రెండు రోజులు సాగనుంది. నేడు, రేపు మోదీ బంగ్లాదేశ్ లో పర్యటించి, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ, ఆర్థిక సంబంధాల బలోపేతంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో ప్రత్యేక చర్చలు జరపనున్నారు.

గత సంవత్సరం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత ఇంతవరకూ ప్రధాని దేశాన్ని దాటి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే. మహమ్మారి తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ, మోదీ తొలి విదేశీ పర్యటన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ నుంచి మొదలవుతోంది. 
India
Bangladesh
Narendra Modi
Sheik Haseena

More Telugu News