Nara Lokesh: 22 నెలల్లో ఒక్క ఇల్లు కట్టలేని జగన్ రెడ్డికి పేదల ఇళ్లు కూల్చే అధికారం ఎవరిచ్చారు?: నారా లోకేశ్

Nara Lokesh slams CM Jagan and YCP mla
  • తాడేపల్లి 2వ వార్డులో 320 కుటుంబాలు ఉన్నాయన్న లోకేశ్
  • 45 ఏళ్లుగా వారు అక్కడే ఉంటున్నారని వెల్లడి
  • సాన్థిక ఎమ్మెల్యే వారి ఇళ్లు కూల్చే కుట్ర చేస్తున్నాడని ఆరోపణ
  • ఒక్క ఇటుక కదిలినా తాను రంగంలోకి దిగుతానన్న లోకేశ్
సీఎం జగన్ పై నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. 22 నెలల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేని జగన్ రెడ్డికి పేదల ఇళ్లు కూల్చే అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు. తాడేపల్లి 2వ వార్డులో 320 కుటుంబాల వారు 45 ఏళ్లుగా నివాసం ఉంటున్నారని, అయితే స్థానిక ఎమ్మెల్యే వారి ఇళ్లు కూల్చడానికి కుట్రలు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. 320 ఇళ్లలో ఒక్క ఇటుక కదిపినా తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్కడి ప్రజలకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. తాడేపల్లి 2వ వార్డుకు చెందిన మహిళలు ఇవాళ తనను కలిసిన అనంతరం లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Nara Lokesh
Jagan
Tadepally
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News