Attack: హైదరాబాద్‌లో తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై దుండగుల దాడి

Bhim Army Telangana Chief Sujith Attacked
  • గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన
  • స్కార్పియో వాహనంలో వచ్చి కత్తులతో దాడి
  • ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు

తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై గత అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి జరిగింది. సుజిత్ తన బైక్‌పై బంజారాహిల్స్‌లోని ఇంటికి వెళ్తుండగా ఖైరతాబాద్ చౌరస్తాలో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News