Dilip Ghosh: నిక్కర్ వేసుకోండి: మమతా బెనర్జీపై దిలీప్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు

BJP Bengal Chiefs Shocking Remark On Mamata Banerjee
  • ఇటీవల ఒక దాడిలో గాయపడిన మమత
  • తన కాలికి కట్టిన కట్టు కనిపించేలా ప్రచారం చేస్తున్న వైనం
  • నిక్కర్ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుందంటూ దిలీప్ ఘోష్ వ్యాఖ్య

ఇటీవల జరిగిన ఒక దాడిలో గాయపడ్డ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీల్ చైర్ లో కూర్చొనే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రచారం సందర్భంగా ఆమె తన కాలికి కట్టిన కట్టు కనిపించేలా కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళ్లను చూపించాలనుకుంటే నిక్కర్లు వేసుకోవాలని వ్యాఖ్యానించారు.

పురూలియాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, కాలికి వేసిన ప్లాస్టర్ ను తొలగించి పెద్ద బ్యాండేజ్ కట్టుకున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ తన కాలిని చూపిస్తూ సానుభూతి పొందాలనుకుంటున్నారని అన్నారు. ఆమె చీర కట్టుకున్నప్పటికీ ఆమె కాలు ఎక్స్ పోజ్ అవుతోందని చెప్పారు. 'మీరు కాళ్లను చూపించాలనుకుంటే చీరకు బదులుగా నిక్కర్ వేసుకోండి. అప్పుడు అందరికీ ఇంకా బాగా కనిపిస్తుంది' అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి వక్రబుద్ధి కలిగిన బీజేపీ నేతలు బెంగాల్ లో గెలవగలరా? అని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News