India: ఇక నిబంధనలు కఠినతరం... రైలులో సిగరెట్ తో పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష!

Train Rules Stricted in India
  • రైలు టాయిలెట్ లో సిగరెట్ వేయడంతో మంటలు
  • కీలక నిర్ణయాలు తీసుకున్న రైల్వే బోర్డు
  • ఇకపై అలా కుదరదన్న ఉన్నతాధికారులు
ఇటీవల ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళుతున్న రైలు టాయిలెట్ లో ఓ ప్రయాణికుడు వేసిన సిగరెట్ వల్ల మంటలు వచ్చిన ఘటన పర్యవసానంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్లో ఒక్క సిగరెట్ ను కలిగివుండి పట్టుబడినా, రైల్వే చట్టం 164 ప్రకారం కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. గతంలో సిగరెట్ కాలుస్తూ పట్టుబడితే కేసు నమోదు చేయడం లేదా జరిమానా విధించేవారు. చాలాసార్లు చూసీ చూడనట్టు వదిలేస్తుండేవారు కూడా. ఇకపై మాత్రం అలా కుదరదు.

రైల్లో సిగరెట్ తో పట్టుబడితే, మూడు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఇదే సమయంలో మరో రూ.500 సెక్షన్ 165 కింద కట్టాల్సి వుంటుంది. సిగరెట్ కలిగివుండటాన్ని రైళ్లలో పేలుడు పదార్థాల రవాణా నిషేధ చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇక ప్యాంట్రీ కారు సహా రైల్లోని ఏ బోగీలోనూ సిగరెట్, బీడీ, చుట్ట వంటివి ఉండేందుకు వీల్లేదు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్త నిర్ణయాలపై వారం రోజుల పాటు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని బోర్డు ఆదేశాలు వెలువరించింది.
India
Train
Fire Accident
Cigaret
Jail

More Telugu News