England: టీమిండియాతో తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్

England won the toss against India in Pune
  • భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్
  • పూణే వేదికగా మ్యాచ్ లు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • భారత జట్టులో ప్రసిద్ధ్ కృష్ణకు స్థానం
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ నేడు జరగనుంది. పూణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్ లు కోల్పోయిన ఇంగ్లండ్ వన్డేల్లోనైనా సత్తా చాటాలని తపిస్తోంది. మరోపక్క, కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అన్ని ఫార్మాట్లలోనూ పైచేయి నిరూపించుకునేందుకు తహతహలాడుతోంది.

ఈ వన్డే మ్యాచ్ లో టీమిండియా తరఫున ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్య అరంగేట్రం చేయనున్నారు. స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్ కు చోటిచ్చారు. శిఖర్ ధావన్ మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక, ఇంగ్లండ్ జట్టులో బ్యాట్స్ మన్ శామ్ బిల్లింగ్స్ ను తీసుకున్నారు.
England
Indai
Toss
ODI
Pune

More Telugu News