Gutta Jwala: లవ్ మ్యారేజ్ కాదు.. గుత్తా జ్వాల, నేను ఒకరినొక‌రం అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటున్నాం: హీరో విష్ణు విశాల్‌

its not love marriage says vishnu vishal
  • త్వ‌ర‌లోనే వివాహం చేసుకుంటాం 
  • గ‌త‌ వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చింది
  • గుత్తా జ్వాల తన గురించి అనుభవాలను పంచుకుంది
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో తమిళ హీరో విష్ణు విశాల్‌కు ఇప్ప‌టికే నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 'కాడన్' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో విష్ణు విశాల్ మాట్లాడుతూ...  తాను త్వ‌ర‌లో గుత్తా జ్వాలాను వివాహం చేసుకోనున్న‌ట్లు తెలిపాడు.

అయితే, త‌మది ల‌వ్ మ్యారేజ్ కాద‌ని స్ప‌ష్టం చేశాడు. గ‌తంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని, కానీ, ఆ వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందని బాధ‌ప‌డ్డాడు. అందుకే గుత్తా జ్వాల, తాను ఒకరినొక‌రం అర్థం చేసుకుని వివాహం చేసుకుంటున్నామ‌ని చెప్పాడు. గుత్తా జ్వాల తన అనుభవాలను తనతో పంచుకుంద‌ని అన్నాడు.

తాను ఆమె జీవిత‌క‌థ‌ను సినిమాగా నిర్మించాలనుకుంటున్నాన‌ని తెలిపాడు. ఇక తాను కాడన్ సినిమాలో నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని అన్నాడు. ఈ ఏడాది తాను నటించిన నాలుగు సినిమాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపాడు.
Gutta Jwala
marriage
Tamilnadu
Tollywood

More Telugu News