Mamata Banerjee: అంబేద్కర్ కంటే మోదీనే మహానుభావుడు అని బీజేపీ వాళ్లు మిమ్మల్ని నమ్మించగలరు: మమతా బెనర్జీ

Mamata Banarjee slams BJP leaders
  • మొతేరా స్టేడియానికి మోదీ పేరు
  • స్పందించిన మమతా బెనర్జీ
  • దేశానికి కూడా మోదీ పేరే పెట్టేస్తారని ఎద్దేవా
  • బంకురా జిల్లాలో మమత ఎన్నికల ప్రచారం
గుజరాత్ లోని మొతేరా క్రికెట్ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరిట పునఃనామకరణం చేయడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఏదో ఒకనాడు భారతదేశానికి కూడా నరేంద్ర మోదీ దేశం అని పేరు మార్చేస్తారని ఎద్దేవా చేశారు. బంకురా జిల్లా కొతులాపూర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు సామాన్యులు కారని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కంటే ప్రధాని నరేంద్ర మోదీనే గొప్పవాడని నమ్మించగలరని వ్యాఖ్యానించారు. గుజరాత్ లో ఆయన పేరిట ఓ స్టేడియానికి నామకరణం చేయడం మీరు చూడలేదా? అని ప్రశ్నించారు.

ఇక, మహిళలు ట్రెండీగా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకోవడంపై ఉత్తరాఖండ్ సీఎం చేసిన వ్యాఖ్యలను మమత తప్పుబట్టారు. సమాజానికి ఇలాంటి వ్యాఖ్యలతో తప్పుడు సందేశం పంపుతున్నారని విమర్శించారు. మహిళలు ఏం తినాలో, ఏం కట్టుకోవాలో హుకుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు.
Mamata Banerjee
BJP
Narendra Modi
Ambedker
West Bengal

More Telugu News