YS Sharmila: తెలంగాణలోని ముస్లింల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన షర్మిల

YS Sharmila comments on Telangana Muslims
  • ముస్లింలతో సమావేశమైన షర్మిల
  • ముస్లింలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా చూస్తోందని మండిపాటు
  • మనం చేతులు కలిపితే రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావచ్చని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని తన కార్యాలయంలో ముస్లింలతో ఈరోజు ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు చెందిన 50 వేల ఎకరాల భూములు కబ్జాకి గురయ్యాయని చెప్పారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత దివంగత రాజశేఖరెడ్డిదేనని అన్నారు.

 ముస్లింలను తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని... వారికి 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చి, మోసం చేశారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను హేట్ బ్యాంక్ గా వాడుకుంటోందని విమర్శించారు. మనందరం చేతులు కలిపితే తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావచ్చని చెప్పారు.
YS Sharmila
Muslims
Telangana
TRS
BJP

More Telugu News