Goutam Sawang: దేశంలో ఉత్తమ డీజీపీగా గౌతమ్ సవాంగ్... అభినందించిన సీఎం జగన్

AP DGP Goutam Sawang gets best DGP award as CM Jagan appreciated
  • జాతీయ స్థాయిలో ఏపీ పోలీసులకు అవార్డుల పంట
  • అత్యుత్తమ పోలీసింగ్ కు 13 పురస్కారాలు
  • క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన డీజీపీ
  • ఏపీ పోలీస్ ఖ్యాతిని ఇనుమడింపచేశారన్న సీఎం
  • ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచారని కితాబు
ఏపీ పోలీస్ విభాగం ఖ్యాతి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అత్యుత్తమ స్థాయిలో సేవలు అందిస్తున్నందుకు ఒకే రోజు 13 అవార్డులు ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ ను వరించాయి. అన్నింటికి మించి దేశంలోనే ఉత్తమ డీజీపీగా రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ఎంపికయ్యారు.

సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసిన డీజీపీ తన సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ ను ఏపీ సీఎం జగన్ అభినందించారు. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ విభాగాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు సవాంగ్ ను కొనియాడారు. స్మార్ట్ విధానాలతో ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. సీఎం అభినందనలకు డీజీపీ సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.
Goutam Sawang
Best DGP
Andhra Pradesh
India
Jagan
YSRCP

More Telugu News