షోపియాన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ‘లష్కరే’ ఉగ్రవాదుల హతం

4 terrorists killed in encounter in  Shopian district
  • మనిహాల్ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు
  • సీఆర్‌పీఎఫ్, సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్
  • కొనసాగుతున్న గాలింపు
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగురు హతమయ్యారు. మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు.

గమనించిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
Go Back to Shorts
Jammu And Kashmir
Shopian
Encounter
Terrorists

More Telugu News