Palla Rajeswar Reddy: సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ విజేత పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeswar Reddy met CM KCR after wins MLC elections
  • తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఖమ్మం-నల్గొండ-వరంగల్ స్థానంలో పల్లా విజయం
  • ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్ కు విచ్చేసిన పల్లా
  • పల్లాకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్
  • పల్లా విజయానికి కృషి చేశారంటూ ఎర్రబెల్లికి ప్రశంసలు
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఈ క్రమంలో పల్లా ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ అర్బన్, రూరల్ నేతలు కూడా ఉన్నారు.

తనను కలిసిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఎమ్మెల్సీగా మెరుగైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా విజయానికి కృషి చేశారంటూ మంత్రి ఎర్రబెల్లిని కూడా సీఎం కేసీఆర్ ప్రశంసించారు.
Palla Rajeswar Reddy
KCR
MLC
Elections
Telangana

More Telugu News