Junior NTR: 'జీవితాన్ని మారుద్దాం రామ్మా' అంటూ పిలుస్తోన్న‌ ఎన్టీఆర్.. టీవీ షో కొత్త ప్రోమో విడుద‌ల‌

 NTR Evaru Meelo Koteeswarulu Coming soon on Gemini TV
  • జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'  
  • త్వ‌ర‌లో ప్రారంభం
  • మ‌రో ప్రోమోతో ముందుకొచ్చిన ఎన్టీఆర్
'ఆట నాది, రూ.కోటి మీది' అని అంటున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఈ షో జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' తో బుల్లితెర‌ ప్రేక్ష‌కుల ముందుకు ఎన్టీఆర్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.  

ఇటీవల‌ విడుద‌ల చేసిన ఈ షో  ప్రోమోలో ఎన్టీఆర్ క‌న‌ప‌డిన విష‌యం తెలిసిందే. బుల్లితెర‌పై ఈ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో మ‌రో ప్రోమోను విడుద‌ల చేశారు. జీవితాన్ని మారుద్దాం రామ్మా అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి.  

గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. అది సూప‌ర్ హిట్ అయింది.  'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు.  


Junior NTR
Meelo Koteeswarulu
Gemini

More Telugu News