Medaram: నేటి నుంచి మళ్లీ తెరుచుకోనున్న మేడారం ఆలయం

Medaram Sammakka Temple Opens From Today
  • గత నెల 24 నుంచి 27 వరకు మినీ జాతర
  • సిబ్బందికి కరోనా సోకడంతో ఆలయం మూత
  • నేటి నుంచి భక్తులకు వనదేవతల దర్శనం
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నేటి నుంచి తిరిగి తెరుచుకోనుంది. గత నెల 24 నుంచి 27 వరకు చిన్న జాతర జరిగింది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో పలువురు భక్తులతోపాటు విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు సిబ్బంది కరోనా వైరస్ బారినపడడంతో అప్రమత్తమైన అధికారులు ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 20 రోజులపాటు ఆలయాన్ని మూసి వేసిన అధికారులు నేటి నుంచి మళ్లీ తెరవాలని నిర్ణయించారు.
Medaram
Sammakka Saralamma
Mulugu

More Telugu News