Hayat Nagar: హయత్ నగర్ గురుకుల కళాశాలలో కరోనా వ్యాప్తి... 37 మందికి పాజిటివ్

Corona scares looming in Telangana educational institutions after re opening
  • పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా వ్యాప్తి
  • హయత్ నగర్ హాస్టల్లో 400 మంది విద్యార్థులు
  • నలుగురు సిబ్బందికి కూడా పాజిటివ్
  • విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
హైదరాబాదులోని పలు పాఠశాలలు, కాలేజీల్లో కరోనా కలకలం రేగుతోంది. తాజాగా హయత్ నగర్ లోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల హాస్టల్లో 37 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వసతి గృహంలో 400 మంది విద్యార్థులు ఉన్నారు.

కరోనా నేపథ్యంలో విద్యార్థుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇటీవలే విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే విద్యాసంస్థల పునఃప్రారంభం తర్వాత కరోనా వైరస్ ప్రబలుతుండడం అధికార వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
Hayat Nagar
Social Welfare Junior College
Corona Virus
Positive Cases

More Telugu News