England: టీమిండియాతో చివరి టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్

England wins toss in series decider against Team India
  • అహ్మదాబాద్ లో ఐదో టీ20
  • సిరీస్ లో రెండేసి మ్యాచ్ లు నెగ్గిన భారత్, ఇంగ్లండ్
  • సిరీస్ విజేతను తేల్చనున్న చివరి మ్యాచ్
  • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించిన భారత్
  • నటరాజన్ కు చోటు
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నేడు చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ లో 2-2తో సమవుజ్జీలుగా నిలవడంతో ఈ మ్యాచ్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఐదో టీ20 మ్యాచ్ తో సిరీస్ విజేత ఎవరన్నది తేలనుంది.

కాగా ఈ మ్యాచ్ కోసం టీమిండియా కేఎల్ రాహుల్ ను తప్పించింది. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక, రోహిత్ శర్మకు జోడీగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. అటు ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
England
Toss
Team India
T20
Ahmedabad

More Telugu News