Somireddy Chandra Mohan Reddy: చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలనేది జగన్ ఆలోచనగా ఉంది: సోమిరెడ్డి

Jagans idea is to keep Chandrababu in jail for at least 16 days says Somireddy
  • తిరుపతి ఉప ఎన్నిక టీడీపీకి ప్రతిష్ఠాత్మకం
  • ఈ ఎలక్షన్ సైకిల్ కి, ఫ్యాన్ కు మధ్య జరుగుతోంది
  • వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని ప్రజల చేత తాగిస్తోంది
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 16 నెలలు జగన్ జైల్లో ఉండొచ్చారని... దీంతో, కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలనేది ఆయన టార్గెట్ గా కనిపిస్తోందని అన్నారు. నాసిరకం మద్యాన్ని ప్రజల చేత తాగిస్తున్నారని... దీంతో, జనాలు పక్షవాతం వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారని చెప్పారు.

తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకమని సోమిరెడ్డి అన్నారు. ఈ ఉపఎన్నిక సైకిల్ కి, ఫ్యాన్ కి మధ్య జరుగుతోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వాలంటీర్లతో ప్రజలను మభ్యపెట్టినట్టు ఈ ఎలెక్షన్ లో చేసే అవకాశం లేదని అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని... వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఉపఎన్నికలో డాక్టర్ గురుమూర్తిని వైసీపీ బరిలోకి దించింది.
Somireddy Chandra Mohan Reddy
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Tirupati LS Bypolls

More Telugu News