Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటివ్

Pakistan PM Imran Khan tests positive for Corona
  • కోవిడ్ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ
  • రెండు రోజుల క్రితమే వ్యాక్సిన్ తీసుకున్న ఇమ్రాన్
  • హోమ్ ఐసొలేషన్ లో ఉన్న పాక్ ప్రధాని
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షలో ఆయన పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆరోగ్య మంత్రి ఫైసల్ సుల్తాన్ తెలిపారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఇంటి వద్దే ఐసొలేషన్ లో ఉన్నారని వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఇమ్రాన్ ఖాన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు పాటించాలని వ్యాక్సినేషన్ తీసుకున్న సందర్భంగా ఇమ్రాన్ పిలుపునిచ్చారు.
Imran Khan
Pakistan
Corona Positive

More Telugu News